మాట తిప్పిన కోదండరాం.. కానీ మళ్లీ అదే పదును.. రాష్ట్రంలో కంసుడు

సోమవారం, 17 సెప్టెంబరు 2012 (20:00 IST)
FILE
కేసీఆర్‌ను సైతం లెక్కచేయక తెలంగాణ మార్చ్ పై పట్టుబడుతున్న తెలంగాణ జేఏసీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ మంత్రి శ్రీధర్‌పై చేసిన వ్యాఖ్యలపై మాట తిప్పారు. తన వ్యాఖ్యలను మీడియా కత్తిరించడం వల్లే ఈ రాద్దాంతం జరుగుతోందన్నారు. తన ఉద్దేశ్యం వ్యక్తులపై దాడి కాదనీ, ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ తెచ్చుకోవడమేనని పునరుద్ఘాటించారు.

తెలంగాణ మంత్రులు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారనీ, తన ఇంటిపై దాడులకు ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. ఎవరెన్ని అడ్డుకట్టలు వేయాలని చూసినా సెప్టెంబరు 30న తెలంగాణ మార్చ్ నిర్వహించి తీరుతామని గట్టిగా చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కంసుడు పాలన జరుగుతోందని కిరణ్ కుమార్ రెడ్డిని కంసుడుతో పోల్చుతూ మరోసారి ఘాటయిన వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబుపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... చట్ట పరిధిని దాటితే చర్యలు తప్పని హెచ్చరించారు. ఏం జరుగుతుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి