స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

సిహెచ్

మంగళవారం, 15 జులై 2025 (23:30 IST)
కొంతమంది అధిక బరువును ఎలా వదిలించుకోవాలి అని తిప్పలు పడుతుంటారు. ఐతే మరికొందరు మాత్రం ఎంత తింటున్నా తాము లావెక్కడం లేదని వాపోతుంటారు. ఇలా సన్నగా వున్నవారు కొన్ని పదార్థాలను తింటుంటే క్రమంగా లావయ్యే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము.
 
నట్స్ లేదా గింజలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లకు సహజ వనరులు. కనుక బరువు పెరగాలనుకునేవారు తమ ఆహారంలో గింజలను చేర్చుకోవాలి.
 
వేట మాంసం, చికెన్ మొదలైన మాంసాహారాలు కూడా అధిక కేలరీల కలిగిన ఆహారాలు, ఇవి కండరాల పెరుగుదల ప్రక్రియలో సహాయపడి బలం, ఆరోగ్యాన్ని ఇస్తాయి.
 
చిక్కుళ్ళు, పండ్లు, తృణధాన్యాలు, బంగాళాదుంపలు వంటి పిండి పదార్థాలున్న కూరగాయలు తింటే బరువు పెరగవచ్చు.
 
కోడిగుడ్లులో అధిక కేలరీల వుంటాయి కనుక వాటిని తింటుంటే బరువు పెరగవచ్చు.
 
డార్క్ చాక్లెట్ అనేది బరువు పెరగడానికి దోహదపడే కేలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థం.
 
పాలు, పెరుగు, వెన్న, జున్ను వంటి ఇతర పాల ఉత్పత్తులు కూడా కేలరీలు, కొవ్వు పదార్ధాలతో ఉంటాయి కనుక వీటిని తింటే లావవుతారు.
 
నెయ్యి బరువు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది కేలరీలు అధికంగా ఉండే ఆహారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు