మొద్దుశీను కేసు: ముద్దాయి ఓంప్రకాష్‌కు జీవిత ఖైదు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన మొద్దుశీను హత్య కేసులో ప్రధాన ముద్దాయి ఓం ప్రకాష్‌కు అనంతపురం సెషన్సు కోర్టు జీవితకారాగార శిక్షను విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. పరిటాల రవీంద్ర హత్య కేసులో మద్దెలచెరువు సూరికి కుడిభుజంగా ఉన్న మొద్దు శీనును హైదరాబాద్‌ శివార్లలోని ఒక ఇంటిలో బాంబు తయారు చేస్తున్న సమయంలో పేలడంతో పోలీసులకు చిక్కిపోయాడు. తీవ్రంగా గాయపడిన మొద్దు శీనును ఆస్పత్రికి తరలించగా, అక్కడ పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

మొద్దుశీను అరెస్టులో పరిటాల రవీంద్ర హత్య కేసులోని మిస్టరీ వీడిపోయింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ వచ్చిన మొద్దశీనును 2008 నవంబరు నెలలో దారుణ హత్యకు గురయ్యాడు. రామకోటి రాసుకుంటుండగా, మొద్దుశీను జైలు గదిలోని లైటు ఆర్పివేశాడని, ఈ కోపంతోనే శీనును హత్య చేసినట్టు ఓంప్రకాష్ ఆ తర్వాత మీడియాకు వెల్లడించాడు.

దీంతో శీను హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు. ఈ కేసు విచారణ అనంతరం నాలుగో అదనపు సెషన్స్ కోర్టులో సాగగా, బుధవారం తుది తీర్పు వెలువడింది. తీర్పు అనంతరం ముద్దాయి ఓంప్రకాష్ స్పందిస్తూ మద్దెలచెరువు సూరి, ముఖ్యమంత్రి రోశయ్యలు కుమ్మక్కై తనకు శిక్షపడేలా చేశారని ఆరోపించారు. ఈ తీర్పును పైకోర్టులో సవాల్ చేయనున్నట్టు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి