ఆపై ఈ ప్రాంతంలోని 94 మందికి కరోనా వైద్య పరీక్షలు చేయగా, 35 మందికి వైరస్ సోకినట్టు తేలింది. దీంతో తుగ్లకాబాద్ ఎక్స్ టెన్షన్ ప్రాంతాన్నంతా సీజ్ చేసిన అధికారులు, కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.
కాగా, న్యూఢిల్లీలో అతిపెద్ద కరోనా హాట్ స్పాట్ గా నిజాముద్దీన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడ జరిగిన మత ప్రార్థనల కారణంగా, దేశంలో వేలాది మందికి వైరస్ సోకింది. ఇక, రెండో హాట్ స్పాట్ గా చాందినీ మహల్ ప్రాంతం నిలిచింది.