నటి జమున భర్త రమణారావు మృతి.. నేడు అంత్యక్రియలు!

మంగళవారం, 11 నవంబరు 2014 (11:45 IST)
అలనాటి నటి జమున భర్త జూలూరి రమణారావు సోమవారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు వయస్సు 86 యేళ్లు. సోమవారం రాత్రి ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
ప్రొఫెసర్ అయిన రమణారావు ఉస్మానియా యూనివర్శిటీ, శ్రీవేంకటేశ్వరా యూనివర్శిటీల్లో జువాలజీ అధ్యాపకుడిగా పనిచేశారు. 1965లో జమున, రమణారావుల వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి