నెల్లూరు జీజీహెచ్‌లో ఉన్నతాధికారి లైంగిక వేధింపుల పర్వంపై డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. దీనిపై ఆయన స్పందించారు. ఈ వ్యవహారంపై వాస్తవాలు తెలుసుకునేందుకు సీనియర్ వైద్యులతో త్రిసభ్య కమిటీ వేశారు. నెల్లూరు ACSR మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సాంబశివరావు, ఇద్దరు ప్రొఫెసర్స్‌తో విచారణకు అదేశించారు.