ఆనందయ్య కరోనా మందుకు ఏపీ హైకోర్టు పచ్చజెండా ఊపింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం హైకోర్టుతో పాటు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, కంట్లో వేస పసరు మందుకు మాత్రం తాత్కాలిక అనుమతి నిలిపివేశారు. మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆ మందు కోసం జనాలు ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా, ఔషధం పంపిణీకి తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై చర్చించారు. వికేంద్రీకరణ పద్ధతి, ఆన్‌లైన్ ద్వారా మందుల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. అదేసమయంలో ప్రభుత్వం కూడా మందు పంపిణీపై కొన్ని ఆంక్షలు కూడా విధించింది. కరోనా రోగులెవ్వరూ రావొద్దని, వారి కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చి మందు తీసుకెళ్లాలని కోరింది.