కార్పొరేషన్లకు సొంత వ్యాపారాలు లేకుండానే వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుని ప్రభుత్వ అవసరాలు తీరుస్తున్నాయి. ఆ రుణాల భారం పడేది ప్రభుత్వం పైనే. ఈ లెక్కన ఇప్పటికే దాదాపు రూ.4లక్షల కోట్ల వరకు ఉన్న ప్రభుత్వ అప్పునకు కార్పొరేషన్ల ద్వారా తీసుకువచ్చిన మరో రూ.1,35,600 కోట్లు కలిపి చూడాలని విశ్లేషిస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వ అప్పు రూ.5.35 లక్షల కోట్ల మొత్తానికి చేరుకుంటున్నట్లే భావించాల్సి వస్తుందని చెబుతున్నారు.