ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

శనివారం, 29 అక్టోబరు 2022 (12:28 IST)
ఉత్తర తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. దీంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. 
 
ఇందులో భాగంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం వుంది. దక్షిణ కోస్తాలోనూ వర్షాలు పడే అవకాశం వుంది. రాయల సీమ ఆది, సోమవారాలు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు