'ప్రేమలు' అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. రీసెంట్‌గా రిలీజైన ఫస్ట్ సింగిల్ బూమ్ బూమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మేకర్స్ సెకండ్ గేర్ బాగుండు పో సాంగ్‌ని రిలీజ్ చేశారు.
ప్రదీప్ రంగనాథన్ తను ప్రేమించిన అమ్మాయి ఛాయిస్‌ని రెస్పెక్ట్ చేస్తూ తన లవ్ ఫీలింగ్స్‌ని ప్రజెంట్ చేసే ఈ సాంగ్ ని సాయి అభ్యాంకర్ హార్ట్ టచ్చింగ్ మెలోడీగా కంపోజ్ చేశారు. సంజిత్, సాయి అభ్యాంకర్ వోకల్స్ అద్భుతంగా వున్నాయి. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం మనసుని హత్తుకునేలా వుంది.
వినగానే కనెక్ట్ అయ్యే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్, లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్. భరత్ విక్రమన్ ఎడిటర్. ఈ దీపావళికి డ్యూడ్ కలర్‌ఫుల్, మ్యూజిక్‌తో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది.