బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ని లాంచ్ చేసి యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ఇట్లు మీ ఎదవ గ్లింప్స్ చూశాను, చాలా బావుంది. చాలా ఫన్నీగా వుంది.
ప్రతి అబ్బాయికి ఈ టైటిల్ చిన్నప్పటి నుంచి కెరీర్‌లో సెటిల్ అయిన తర్వాత కూడా అలాగే వుంటుంది, అలాంటి టైటిల్ పెట్టారు అంటూ నవ్వుకున్నారు. ఇది మంచి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్, చూడటానికి చాలా బావుంది. ఇట్లు మీ ఎదవ టీం అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావలని కోరుకుంటున్నాను అంటూ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పారు.
ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, మధుమణి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందించడం విశేషం. ఇటీవల నాలుగు ఇంటర్నేషనల్ అవార్డ్స్ సాధించిన జగదీష్ చీకటి డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి ఉద్ధవ్ ఎస్బీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.