తమ ప్రాణాలన ఫణంగా పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోతున్నట్టు మద్యం బాబులు కామెంట్స్ చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ పుణ్యమాని దేశ వ్యాప్తంగా 46 రోజుల తర్వాత మద్యం దుకాణాల దేశంలో తెరుచుకున్నాయి. దీంతో మద్యంబాబులు వైన్ షాపులకు ఎగబడ్డారు. అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలకు తూట్లు పొడిచి... కిలోమీటర్ల మేరకు బార్లు తీరారు. వీటిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. వీటిపై మద్యంబాబులు తమదైనశైలిలో స్పందించారు.
తమకు ధరలు ముఖ్యం కాదని, కిక్ ముఖ్యమంటున్నారు. దేశం కష్టకాలంలో ఉన్న తరుణంలో తాము డొనేషన్లు ఇస్తున్నట్లుగానే భావించాలన్నారు. కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయని, ఇపుడు తాము మద్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా కొంతమేరకు ఆదుకుంటున్నట్టు చెప్పారు.
కాగా,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం 25 శాతం, మంగళవారం 50 శాతం ధరలు పెంచింది. మొత్తం 75 శాతం ధరలు పెంచుతూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అటు కేజ్రీవాల్ సర్కారు కూడా మద్యం ఏకపక్షంగా 70 శాతం ధరలు పెంచింది.