ఎమ్మెల్సీ ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే లేవు... తప్పుకుంటున్నాం : పేర్ని నాని

ఠాగూర్

గురువారం, 7 నవంబరు 2024 (15:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయి, ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైకాపా రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది. ఈ ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశం లేదని అందుకే ఈ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, కృష్ణా - గుంటూరు, తూర్పు గోదావరి - పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. 
 
ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశం కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. ఓటర్లు ప్రశాంతగా బయటకి వచ్చి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. ఏపీలో అప్రజాస్వామిక పాలన సాగుతుందని, కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయానని విమర్శించారు. అందువల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయరాదని తమ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు