ఏపీ అసెంబ్లీలో ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడితో సహా ఐదుగురిని సస్పెండ్ చేయాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా.. తీర్మానం పాస్ అయినట్లు స్పీకర్ వెల్లడించారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల, పయ్యావుల, గోరంట్ల, వీరాంజనేయస్వామిలు ఉన్నారు.