త్వరలోనే ఏపీ కేబినెట్ విస్తరణ..

శుక్రవారం, 11 మార్చి 2022 (17:49 IST)
త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని ఏపీ సీఎం జగన్ రెడ్డి అన్నారు. ప్రాంతం, కులాల ఆధారంగా కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. చాలామంది ఆశావాహులు ఉన్నారని… కేబినెట్‌లో లేనంత మాత్రాన డిమోషన్లుగా భావించొద్దని సీఎం జగన్ సూచించారు. 
 
మంత్రి పదవి నుంచి తప్పించిన వాళ్లు పార్టీ కోసం పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. కొందరిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తామని జగన్ స్పష్టం చేశారు. పార్టీని గెలిపించుకొని వస్తే మళ్లీ మంత్రులు కావొచ్చని ఆయన సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు