బీజేపీకి షాకిచ్చిన ఉత్తరప్రదేశ్ ఓటర్లు.. ఎందుకు? ఎలా?

శుక్రవారం, 11 మార్చి 2022 (08:20 IST)
భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్ ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో ఆ పార్టీ 273 సీట్లలో గెలుపొందింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ వేడుకల్లో మునిగిపోయారు. కానీ, గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులుగా పని చేసిన 11 మంది మంత్రులను ఓటర్లు చిత్తుగా ఓడించి తేరుకోలేని షాకిచ్చారు. 
 
ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం సీట్లలో సగానికిపైగా సీట్లను కైవసం చేసుకుని అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఏకంగా 11 మంది మంత్రులు చిత్తుగా ఓడిపోవడం ఇపుడు బీజేపీ నేతలను తీవ్ర షాక్‌కు గురిచేసింది.
 
ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు 10 మంది మంత్రులు ఉన్నారు. గడిచిన మూడు దశాబ్దాల్లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ సరికొత్త రికార్డును సృష్టించింది. అయినప్పటికీ 11 మంది నేతలు ఓడిపోవడం ఆ పార్టీకి ఏమాత్రం మింగుడుపడటం లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు