ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సెస్ కాలేజీకీ చేరుకున్నారు. అక్కడ దివంగత మేకపాటి గౌతం రెడ్డి భౌతికకాయానికి నివాళులు ఆర్పించారు. మేకపాటి అంత్యక్రియల్లో పాల్గొంటారు.
మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలు ముగిసిన తరువాత మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్న మేకపాటి గౌతం రెడ్డి సోమవారం రోజున గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే.