ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులపై వేటు.. జీవీ రెడ్డి (video)

సెల్వి

మంగళవారం, 24 డిశెంబరు 2024 (19:04 IST)
Fiber Net
ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులను తొలగిస్తామని ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నట్లు జీవీ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. 
 
గత వైసీపీ ప్రభుత్వంలో అర్హత లేని వారిని ఫైబర్ నెట్‌ ఉద్యోగులుగా నియమించారని తెలిపారు. వైసీపీ హయాంలో తీసుకున్న ఉద్యోగుల్లో వైసీపీ నేతల సిఫార్సుతో ఎక్కువ మంది వచ్చారని.. నిబంధనలు విరుద్ధంగా ఆఫర్ లెటర్, అపాయింట్‌మెంట్ లెటర్ కూడా లేకుండా ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు. 
 
2016-19 మధ్య 108 మంది ఉద్యోగులతో ఫైబర్ నెట్ నడిచిందన్న జీవీ రెడ్డి.. అప్పట్లో ఫైబర్‌ నెట్‌కు 10 లక్షల కనెక్షన్లు ఉండేవన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా 2019-24 మధ్య ఫైబర్ నెట్ ఉద్యోగుల సంఖ్యను 1360కి పెంచారని..కనెక్షన్లు ఐదు లక్షలకు పడిపోయాయని జీవీ రెడ్డి ఆరోపించారు.

Super Man @gvreddy0406 on duty ????????????

ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ హోదాలో, ఏపీ ఫైబర్‌నెట్ నుంచి 410 మంది ఉద్యోగులను తొలగించాల్సిందిగా మా సంస్థ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ప్రూఫ్స్ తో కొడుతున్నాడు… @YSRCParty వాళ్ళు నాశనం చెయ్యని వ్యవస్థ లేదు ????

pic.twitter.com/6H0b3by4cg

— ???????????????????????????? (@Shiva4TDP) December 24, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు