విజయవాడ: జాతీయ స్థాయి అవార్డులు సాధించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమను, ఆయా చిత్ర బృందాలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమా తన ప్రత్యేకతను నిలుపుకోగా, 2019 సంవత్సరానికి గానూ నాలుగు పురస్కారాలను సొంతం చేసుకుంది.
కేవలం కథలే కాకుండా సాంకేతికంగా కూడా తెలుగు సినిమా పురోగతిని సాధించటానికి నిదర్శంగా అవార్డులు పొందగలగటం శుభపరిణామని గవర్నర్ అన్నారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రంగా మహర్షి, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జెర్సీ జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకోవటం పట్ల బిశ్వభూషణ్ సంతోషం వ్యక్తం చేసారు.