స్వాతంత్ర్య పోరాటం, ఉద్యమం అనే అంశంపై ప్రదర్శనలు, పోటీలు, విద్యార్థుల ర్యాలీలు, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్థి సంఘాలు చురుకుగా కార్యక్రమాలలో పాల్గొని 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గుర్తు చేసుకోవాలన్నారు. ఏడాది పొడవునా జరిగే ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులను, వారి కుటుంబ సభ్యులను సత్కరించాలని గవర్నర్ శ్రీ హరిచందన్ పిలుపునిచ్చారు.