కొన్ని న్యూస్ ఛానళ్ళపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు భూమా అఖిలప్రియ. తెలుగుదేశం పార్టీలో మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేను పార్టీని వీడటం ఏమిటి. ఆళ్ళగడ్డలో నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కావాల్సినంత నిధులు ఇచ్చింది. మంత్రిగా పర్యాటక శాఖను అభివృద్థి చేస్తున్నాను. నాకు టిడిపిలో ఒక గౌరవం ఉంది. చంద్రబాబు నాపై ఒక నమ్మకం ఉంచారు.