ఇందులో కే కే మీనన్‌తో పాటు సాకిబ్ సలీమ్, సిమ్రాన్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్, కష్వీ మజ్‌ముందర్ వంటి అద్భుతమైన సమిష్టి తారాగణం కూడా ఉంది. మార్చి 30న, సమంత తన రాబోయే ప్రాజెక్ట్ టీజర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీనిపై ఆమె స్పందిస్తూ.. "మా ప్రేమపూర్వక చిన్న శ్రమను మీకు అందిస్తున్నాము. పెద్ద కలలు కన్న చిన్న బృందం. ఈ ప్రయాణానికి, మేము కలిసి సృష్టించిన దానికి మేము చాలా కృతజ్ఞులం. మీరు మా సినిమాను ఆస్వాదిస్తారని మేము నిజంగా ఆశిస్తున్నాం. ఇది నిజంగా ప్రత్యేకమైనదానికి నాంది కావాలని కోరుకుంటున్నాను" అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. సమంత షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.