ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నూరు శాతం ప్రజల్లోకి వెళ్లడంతో అసెంబ్లీ సమావేశాల్లో ఏం చర్చించాలో తెలియక అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని గుర్తు చేశారు. గత అసెంబ్లీ సమావేసాల్లో అర్థవంతమైన చర్చలకు అవకాశమివ్వకుండా గొడవలు సృష్టించి వాకౌట్ చేయడం పరిపాటి అయ్యిందన్నారు. ఈసారి మరో అడుగు ముందుకు వేసి అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తామని చెప్పడం సరికాదని అన్నారు.