ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఉన్న పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళ సమయంలో కార్మికులు అప్రమత్తంగా ఉండి అక్కడ నుంచి బయటకు వెళ్లిపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది.
ఈ జిల్లాలోని యాడికిలో పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలోని బొగ్గుతో మండే గొట్టం వేడి పెరగడంతో పేలుడు ఒక్కసారిగా సంభవించింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇందులో పనిచేసే కార్మికులంతా టీ తాగేందుకు బయటకు వెళ్లివున్నారు. దీంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి.