నలుగురు కుటుంబ సభ్యులను ఉరితీసిన నక్సలైట్లు

ఆదివారం, 14 నవంబరు 2021 (15:59 IST)
బీహార్ రాష్ట్రంలోని గయాలోని మొన్​బార్ గ్రామంలో ఓకే కుటుంబానికి చెందిన నలుగురిని నక్సలైట్లు ఉరితీశారు. ఆ తర్వాత వారి ఇంటిని బాంబుతో పేల్చేశారు. మృతుల్లో ఇద్దరు సోదరులు, వారివారి భార్యలు ఉన్నట్టు సమాచారం. 
 
వీరందరినీ పోలీసుల ఇన్ఫార్మర్లుగా వ్యవహరించినందు వల్ల గతంలో జరిగిన ఓ ఎన్​కౌంటర్​లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని, అందుకు ప్రతీకారంగానే ఇప్పుడు ఈ చర్యకు పాల్పడినట్లు నక్సలైట్లు పోస్టర్​ అంటించారు. పైగా, ఈ గ్రామంలో ఎవరైనా తమకు నమ్మక ద్రోహం చేస్తే వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. 
 
ఈ దారుణం ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందగానే పోలీసులు, సీఆర్​పీఎఫ్ సిబ్బంది హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్​ఎస్​పీ ఆదిత్య కుమార్​, ఎస్పీ రాకేశ్​ కుమార్​ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 
 
పదుల సంఖ్యలో సిబ్బందితో గ్రామంలో పహారా కాస్తున్నారు. దాదాపు 25 మంది నక్సలైట్లు సమూహంగా వచ్చి ఈ నలుగురిని ఉరి తీసినట్లు గ్రామంలోని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అలాగే, ఆ సమీప ప్రాంతాల వాసులను కూడా అప్రమత్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు