పడవ ప్రారంభమైన వెంటనే డ్రైవర్ పడవ ఇంజన్ వేయడం జరిగింది. అయితే వరద కారణంగా పెద్ద ఎత్తున చేరిన చెత్త, ఇంజన్ పంకాకు అడ్డు తగలడంతో ఇంజన్ మోరాయించింది.. గోదావరి నది ప్రవాహం ఎక్కువుగా ఉండటం గాలి కూడా వీయడంతో పడవ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి వంతెన పిల్లర్‌కు తగిలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రయాణికుల్లో విద్యార్థులు కూడా ఉన్నారు.
విద్యార్థులంతా పదో తరగతి లోపువారేనని తెలుస్తోంది. ఇప్పటికే 26 మందిని గ్రామస్తులు కాపాడారు. గల్లంతైన నలుగురి వివరాలింకా తెలియరాలేదు. అప్రమత్తమైన కొందరు విద్యార్థులు అందుబాటులో ఉన్న పిల్లరు ఎక్కి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇంకొందరిని మత్స్యకారులు, స్థానికులు కాపాడారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.