సీఎం జగన్ మోహన్ రెడ్డిని, వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్‌లో విమర్శనాస్త్రాలు సంధించారు. 'ఎలుకలు పట్టడానికి అంత సొమ్మా అని మాట్లాడిన లీకేజీ నిపుణుడు శకుని మామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? రాష్ట్రమంతా ప్రజలు దోమ కాటుకి గురై డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతున్నారు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఏకంగా డాక్టర్లే చనిపోతున్నారు. ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లిలోనే వేల సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు'.
ఖర్చు లేకుండా జ్వరాలు తగ్గించే శకుని మామ మాత్రం లోటస్ పాండ్‌లో వసూళ్ల కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. పేపర్ లీకేజీ సొమ్ములు రాబట్టాలి కదా! గ్రామా సచివాలయ పరీక్షలలో టాప్ మర్క్స్ వచ్చిన లిస్ట్ చెప్పేదేమీ లేదు. లిస్ట్ సరిగ్గా చూస్తే మీకే అర్ధమౌతుంది. తండ్రి శవం దగ్గరకి కూడా వెళ్లకుండా ముఖ్యమంత్రి అవ్వాలని సంతకాలు సేకరించారు.