ఓ మహిళా కూలీపై కాంట్రాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ 26 ఏళ్ల మహిళ బతుకు తెరువు కోసం భర్త, తన నాలుగేళ్ల కూతురితో కలిసి హైదరాబాద్‌కు వలస వచ్చి షేక్‌పేటలో నివాసం ఉంటోంది. దినసరి కూలీగా పనిచేస్తున్న ఆమె మూడు రోజుల క్రితం పని కోసం రవి అనే లేబర్ కాంట్రాక్టర్ దగ్గరకు వెళ్లింది.