మధుర నగరానికి చెందిన సుశీల్ కుమార్ (23), డాలీ చౌదరీ (20) అనే యువతీయువకులు కొంతకాలం పాటు ప్రేమించుకుని, సహజీవనం చేశారు కూడా. ఆ తర్వాత తనకు నొయిడాలో ఉద్యోగం ఇప్పించిన మోహిత్ మావి అనే వ్యక్తితో డాలీకి స్నేహం ఏర్పడింది. దీన్ని సుశీల్ జీర్ణించుకోలేక పోయాడు. తన ప్రియురాలిపై పగ పెంచుకుని బెదిరింపులకు దిగాడు. మళ్లీ తనతో కలిసి ఉండాలనీ, లేదంటే తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు దిగిన ప్రైవేటు ఫొటోలను ఇంటర్నెట్‌లో పెట్టి పరువు తీస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు.
మాజీ ప్రియుడి వ్యవహారంతో ఆందోళనకుగురైన డాలీ అతన్ని అంతమొందించాలని భావించింది. తను పెళ్లిచేసుకోబోతున్న మనీష్ చౌదరీతో పథకం రచించింది. ఓ హోటల్‌లో ఆగస్టు 11న డాలీ సుశీల్ కలుసుకున్నారు. అక్కడ ఎలాంటి అనుమానంరాకుండా వ్యవహరించిన డాలీ సుశీల్‌ను నమ్మించింది. నిద్రమాత్రలు కలిపిన కూల్‌డ్రింక్‌ని అతడి చేత తాగించింది.