రాజధాని కోసం వెయ్యెకరాలు చాలంటున్న వామపక్షాలు, తమ పార్టీ కార్యాలయాల కోసం పదెకరాల మేర భూములు అడుగుతున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన రాఘవులు, పంట భూముల్లో రాజధాని నిర్మాణం బుద్ధి తక్కువ పని అంటూ ధ్వజమెత్తారు.