ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్ ని పూరి జగన్నాథ్ పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో చార్మీ కౌర్ ప్రెజెంట్ గా, JB మోషన్ పిక్చర్స్ JB నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ తో నిర్మిస్తున్నారు. JB మోషన్ పిక్చర్స్‌తో కొలాబరేషన్ మూవీ గ్రాండియర్ ని మరింతగా పెంచుతోంది,
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, విజయ్ కుమార్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో ఈ పాన్-ఇండియా ఎంటర్‌టైనర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఐదు భాషలలో విడుదల కానుంది. మరిన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్స్ ని మేకర్స్ త్వరలో రివిల్ చేయనున్నారు.
తారాగణం: విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్ కుమార్