చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం నిట్టూరు సమీపంలో ఓ సుమో అదుపుతప్పి ఇంటి గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో సుమోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తిరుపత్తూరుకు చెందిన ఆరు మంది కుటుంబ సభ్యులు పుత్తూరు సమీపంలోని కైలాసకోనకు వచ్చి తిరిగి తిరుగు ప్రయాణమవుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
తిరుపతిలో చిరుజల్లుల వర్షం
తిరుపతిలో చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఎండ వేడితో ఇబ్బంది పడిన పట్టణ ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం పొందారు. ఈదురుగాలులతో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వాహనదారులు చిరుజల్లులలోనే తడుస్తూ వాహనాలు నడుపుతున్నారు. చిన్నపిల్లలు కేరింతలు ఆడుతూ వర్షంలో తడుస్తూ కేరింతలు కొట్టారు. ఈ చిరు జల్లుల కారణంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.