ఆ కారు ఇంజిన్ ముందు భాగంలో మొదలైన మంటలు కొద్దిసేపట్లోనే కారంతా వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే, కారులోని భక్తులు వెంటనే కిందకి దిగిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. కాగా, ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, టీటీడీ అధికారులు వెంటనే స్పందించారు. మంటలను ఆర్పివేశారు.
ఇదిలా వుండగా తిరుపతిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనివాస సేతుపై ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కారును వెనుక నుండి ఢీకొట్టింది మరో కారు. ఢీ కొన్న కారు బోల్తా కొట్టడంతో ప్లైఓవర్ పై నిలిచిపోయాయి వాహనాలు. సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు. కేసు నమోదు చెసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.