హెరిటేజ్‌ భూములు పోతున్నాయనే చంద్రబాబు ఆందోళన: రోజా

సోమవారం, 6 జనవరి 2020 (17:09 IST)
నిజమైన రైతులెవరూ ఆందోళన చేయడం లేదని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆమె మాట్లాడుతూ… చంద్రబాబు బినామీలు, హెరిటేజ్ కి చెందిన భూములు పోతున్నాయనే అమరావతిలో ఆందోళనలు చేస్తున్నారన్నారు.

ఐదేళ్లలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కూడా చంద్రబాబు కట్టలేకపోయారన్నారు. ఐదు నెలల పాలన చేసిన జగన్ ను విమర్శించడం హేయమన్నారు. రాజకీయాల కోసం భువనేశ్వరిని చంద్రబాబు పావులా వాడుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. 
 
చంద్రబాబు బినామీల, హెరిటేజ్‌ భూములు పోతున్నాయనే అమరావతిలో చంద్రబాబు ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. 
 
ఐదేళ్లలో ఒక్క శాశ్వత భవనం కట్టని చంద్రబాబు... ఐదు నెలల జగన్‌ పాలనను విమర్శించడం హేయమన్నారు. గత ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిచిన వారిని పక్కనపెట్టామని... ఇప్పుడు వారే వైసీపీ ముసుగులో దాడికి యత్నించారని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని రోజా స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు