కృషి, పట్టుదలతో సివిల్ పరీక్ష సులభం

మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (19:54 IST)
కృషి, పట్టుదలతో సివిల్ సర్వీసెస్ పరీక్షలలో విజేతలు కావడం పెద్ద విషయమేమీ కాదని  విశ్రాంత ఐఏఎస్ బీ రామాంజనేయులు అన్నారు. 

విజయవాడ నగరంలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో మంగళవారం ఇన్ఫామ్ మరియు ది బెస్ట్ ఐఏఎస్ అకాడమీ  ఆధ్వర్యంలో పోటీ పరీక్షలపై విద్యార్థులు తల్లిదండ్రులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ది బెస్ట్ ఐఏఎస్ అకాడమీ స్థాపకులు రామాంజనేయులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన స్ఫూర్తి దాయక ప్రసంగంలో ఢిల్లీ బెంగళూర్  వంటి మహానగరాలలో సివిల్ సర్వీస్ కోచింగులు తీసుకోవడానికి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అదే స్థాయిలో విజయవాడలో ది బెస్ట్ ఐఏఎస్ అకాడమీ ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షలో శిక్షణ ఇచ్చి రాణించాలనే ఉద్దేశ్యంతో అకాడమీని ప్రారంభించడం జరుగుతుందన్నారు.

సివిల్స్ పరీక్షలో సాధించాలనే పట్టుదల విద్యార్థులలో ఉండాలన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమన్నారు.దీనికి ముఖ్యంగా గత ఐదు, ఆరు సంవత్సరాల పాత ప్రశ్న పత్రాలను పరిశీలించాలన్నారు. ముఖ్యంగా 6 నుండి 12వ తరగతి వరకు ఎన్ సిఇఆర్టీ పుస్తకాలను చదవాల్సి ఉంటుంది అన్నారు.

కరెంట్ అఫైర్సకు ప్రధాన ఇంగ్లీష్, తెలుగు పేపర్లను చదవాల్సి ఉంటుంది అన్నారు  కరెంట్ అఫైర్స్ ను విశ్లేషణగా చదవాలన్నారు ప్రస్తుతం చదువుతున్న డిగ్రీలకు ఉద్యోగానికి ఎటువంటి సంబంధం లేదన్నారు డిగ్రీ అనంతరం రెండు నుండి మూడు సంవత్సరాలు నిరంతర శ్రమతో సివిల్స్ సాధించవచ్చని అన్నారు.

ప్రపంచానికే ఇండియా మార్కెట్ ఇస్తుందని యంగ్ జనరేషన్ ఇండియాలోనే అధిక మన్నార. దేశంలో అపార మౌలిక మానవ వనరులు ఉన్నాయన్నారు దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయని నేటికి కూడా 25% దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారని అభిప్రాయపడ్డారు.

సివిల్స్ సముద్రం లాంటిదని దానిని ఈద గల శక్తి  మన వద్ద ఉండాలన్నారు సివిల్స్ సాధిస్తే సమాజములో గౌరవం పెరుగుతుందని, గుర్తింపు వస్తుందన్నారు ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉందని సివిల్స్ కు సంబంధించిన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివినప్పటికీ సివిల్స్లో ర్యాంకు సాధించడం పెద్ద విషయమేమీ కాదని అన్నారు.

మన తెలుగు విద్యార్థులు ఢిల్లీలో ఉన్న కోచింగ్ సెంటర్లకు వెళ్లి అక్కడి వాతావరణ పరిస్థితులు భోజన సదుపాయాలు భాషా సంస్కృతి ఖర్చుల తో సతమతమవుతున్న పరిస్థితిని అనేకమంది సివిల్ సర్వీసెస్ ఎస్పి రెంట్ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మన తెలుగు విద్యార్థులు విజయావకాశాలు మెరుగుపరచి ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత సాధించే విధంగా ది బెస్ట్ ఐఏఎస్ అకాడమీ శిక్షణ ఇస్తామన్నారు.

నిర్దిష్ట ప్రణాళికతో నిండైన ఆత్మవిశ్వాసంతో నిరంతర పర్యవేక్షణలో పోటీ పరీక్షలకు అభ్యర్థులను తయారుచేయడం ది బెస్ట్ ఐఏఎస్ అకాడమీ ప్రత్యేకత అని రామాంజనేయులు  అన్నారు. అవగాహన కార్యక్రమంలో ఐ.ఎఫ్.ఎస్.గడ్డం శేఖర బాబు, న్యూజిలాండ్ ఎన్.అర్.ఐ..యర్రా మదుకుమార్ ల స్పూర్తి దాయకంగా ప్రసంగించారు. అవగాహన కార్యక్రమంలో సంస్ధ కోఆర్డినేటర్ వేల్పుల ప్రత్యుష, ఇన్ఫామ్ అధ్యక్షులు గడ్డం బాపిరాజుఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు