నర్సాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సీఎం

సోమవారం, 21 నవంబరు 2022 (13:12 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సోమవారం వెస్ట్ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరిన ఆయన నర్సాపురం చేరుకుని అక్కడ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత అక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సీఎం పర్యటన సందర్భంగా గట్టి భద్రతను కల్పించారు. 
 
సీఎం జగన్ శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయం, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ శంకుస్థాపన, నర్సాపురం అగ్రికల్చర్ కంపెనీ భూములు, ఉప్పుటేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్ శంకుస్థాపన, నర్సాపురం ప్రాంతీయ వైద్యశాలకు నూతన భవన ప్రారంభోత్సవం, నర్సాపురం బస్ స్టేషన్ పునరుద్ధరణ, ఖజానా మరియు లెక్కల కార్యాలయం, జిల్లా రక్షిత మంచినీటి సరఫరా పథకం. నర్సాపురం అండర్ గ్రౌండ్ డ్రైనీ వ్యవస్థ తదితర అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు