సినీ నటుడు, వైకాపా నేత, ఏపీ చలనచిత్ర అభివృద్ధి మండలి ఛైర్మన్ పోసాని కృష్ణమురళిపై జనసైనికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన వీరమహిళలను కించపరిచేలా పోసాని వ్యాఖ్యలు చేశారంటూ జనసైనికులు ఆరోపించారు. ఇదే అంశంపై వారు రాజమండ్రి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు పోసానిపై 354, 355, 500, 504, 506, 507, 509 సెక్షన్ల కేసు నమోదు చేశారు.
తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పోసాని కించపరిచేలా, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజమండ్రి ఒకటో నంబరు పోలీస్ స్టేషన్‌లో తొలుత ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి... కేసు నమోదు చేయలేదు.