2022-23 సంక్షేమ పథకాల క్యాలెండర్‌ విడుదల.. బాబుకు ఫేర్‌వెల్ లాంటిది

శుక్రవారం, 25 మార్చి 2022 (16:08 IST)
ఏప్రిల్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సంక్షేమ క్యాలెండర్‌ను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. 2022-23 సంక్షేమ పథకాల క్యాలెండర్‌‌లో... ఏప్రిల్‌లో వసతి దీవెన, వడ్డీలేని రుణాలు, మే లో విద్యా దీవెన, అగ్రి కల్చర్‌ ఇన్సూరెన్స్‌, రైతు భరోసా, మత్య్సకార భరోసా, జూన్‌లో అమ్మ ఒడి పథకం, జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు, ఆగష్టులో విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్‌టివ్‌, నేతన్న నేస్తం, సెప్టెంబర్‌లో వైఎస్సార్‌ చేయూత, అక్టోబర్‌లో వసతి దీవెన, రైతు భరోసా, నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు, డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు, జనవరిలో రైతు భరోసా, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు పథకాలు, ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు, మార్చిలో వసతి దీవెన అమలుకు సంబంధించిన వివరాలను ముద్రించిన క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
 
సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను స్వయంగా చదివి వినిపించిన అనంతరం సీఎం జగన్‌ మాట్లాడారు. ఇది పేద వర్గాలకు వెల్‌ఫేర్‌ క్యాలెండర్‌ అని.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, ఆయనకు ఢంకా బజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు ఏమాత్రం రుచించని క్యాలెండర్‌ అని, ఒకరకంగా గుబులు పుట్టించే క్యాలెండర్‌ అని వైఎస్‌ జగన్‌ చమత్కరించారు. 
 
పైగా ఇది చంద్రబాబుకు ఫేర్‌వెల్‌ క్యాలెండర్‌ అవుతుందని చెప్పారు సీఎం వైఎస్‌ జగన్‌.  తమది ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు అంకెల గారడీ బడ్జెట్‌ కాదని, గత మూడేళ్లుగా ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే మంచి బడ్జెట్‌ ప్రవేశపెట్టామని జగన్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు