ప్రధాని మోడీకి స్వాగతం పలుకనున్న ఏపీ సీఎం జగన్

ఆదివారం, 3 జులై 2022 (15:58 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలుకనున్నారు. 
 
అక్కడ నుంచి ప్రధాని మోడీతో కలిసి సీఎం జగన్ కూడా హెలికాఫ్టర్ ద్వారా ఉదయం 11 గంటల సమయానికి భీమవరం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. వీరిద్దరూ కలిసి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. 
 
మరోవైపు, ఆదివారం భీమవరంల భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రధాని పాల్గొనే సభా ప్రాంగణమంతా వర్షపునీరు చేరిపోయింది. దీంతో రేపు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న అంశంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు