రక్తనాళాల సంకోచం వల్ల రక్తపోటు పెరిగి ఇది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది.
చల్లటి వాతావరణంలో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువ, ఈ రక్తం గడ్డలు రక్తనాళాలను అడ్డుకోవడం వల్ల గుండెపోటుకు దారితీస్తుంది.
చలికాలంలో వాతావరణ మార్పులు, పండుగలు, ఇతర కారణాల వల్ల ఒత్తిడి పెరిగి గుండెపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారాలైన తాజా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.
రోజూ కొంతసేపు వ్యాయామం, ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం, యోగా వంటివి చేయండి.