అయితే, కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడాలంటే.. ఖచ్చితంగా సామాజిక భౌతికదూరం పాటిస్తూనే, ముఖానికి మాస్క్ ధరించాల్సిన నిబంధన ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు సూపర్ లగ్జరీ బస్సులను సమూలంగా మార్చాలని నిర్ణయించారు.
అటూ, ఇటూ రెండు రెండు సీట్లుండే చోట ఒక్క సీటునే ఏర్పాటు చేశారు. ఈ మోడల్‌ను అధికారులు ఓకే చేస్తే, మిగతా అన్ని బస్సులనూ ఇలాగే మార్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
అయితే, ఈ బస్సులో ప్రయాణ చార్జీలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. పది సీట్లను తొలగించడం వల్ల తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉంది. దీన్ని భర్తీ చేసుకునే ప్రక్రియలో భాగంగా, అదనపు వడ్డనకు ఆర్టీసీ చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు.