కాగా, రెంటచింతలకు చెందిన 38 మంది టాటా ఏస్ వాహనంలో శ్రీశైలం వెళ్లి మల్లిఖార్జున స్వామిని దర్శనం చేసుకుని తిరిగి తమ ఊరికి పయనమయ్యారు. వీరంతా మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా ప్రమాదం సంభవించింది. రెంటచింతల విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు పక్కన ఆగివున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆ వాహనంలో ఉన్నవారంతా ఎగిరి రోడ్డుపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.