ఏపీలో తగ్గిన మద్యం ధరలు - దుకాణాలకు ప్రత్యేక పూజలు

సోమవారం, 20 డిశెంబరు 2021 (07:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా తగ్గాయి. మద్యం ధరల తగ్గింపును మందు బాబులు ఒక పండుగలా జరుపుకుంటున్నారు. మద్యం దుకాణాలకు క్యూకడుతున్నారు. దుకాణాలకు హారతులిచ్చి, కొబ్బరికాయలు కొట్టారు. ఇలాంటి దృశ్యాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిపించాయి. 
 
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మద్యం దుకాణం వద్ద ఆదివారం కొందరు మద్యం ప్రియులు ఏకంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుకాణానికి హారతులిచ్చారు. పూజలు చేశారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాతే మద్యాన్ని దకుణాన్ని తెరిపించారు. ఆ తర్వాత హారతులిచ్చి మద్యాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
కాగా, మద్యం ధరలను భారీగా తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. మద్యం బ్రాండ్‌ను బట్టి ఈ తగ్గింపు 15 నుంచి 20 శాతం వరకు ఉంది. ముఖ్యంగా ఒక్కో బ్రాండ్‌పై రూ.20 నుంచి రూ.50 వరకు తగ్గింది. ఫుల్‌బాటిల్‌పై ఏకంగా రూ.120 నుంచి రూ.200 వరకు తగ్గింది. అలాగే, అన్ని రకాల బీర్లపై రూ.20 నుంచి 30 వరకు తగ్గించింది. మద్యంపై వసూలు చేస్తున్న వివిధ రకాలైన పన్నుల్లో హేతుబద్ధత తీసుకునిరావడంతో వీటి ధరలు భారీగా తగ్గాయి. 

వెబ్దునియా పై చదవండి