దేవినేని ఉమామహేశ్వర రావు ఇంట్లో విషాదం..

శుక్రవారం, 3 డిశెంబరు 2021 (11:54 IST)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఇంట్లో విషాదం నెలకొంది. దేవినేని తండ్రి శ్రీమన్నారాయణ ప్రాణాలు కోల్పోయారు. 
 
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. 
 
గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస తుదిశ్వాస విడిచారు. శ్రీమన్నారాయణ మరణంపై పలువురు టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
 
దేవినేని శ్రీమన్నారాయణ మృతి బాధాకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు