తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని మోమిన్ పేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి ముగ్గురు పిల్లలు. వీరిని మోమిన్ పేటలో చదివిస్తూ భార్యత కలిసి పటాన్ చెరువులోని ఆ ఫాంహౌజ్‌లో పని చేస్తున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్డౌన్ అమలు చేయడంతో స్కూల్స్ మూసివేశారు. దీంతో ముగ్గురు పిల్లలను తమ వద్దకు తీసుకెళ్లారు.
ఈ క్రమంలో 8వ తరగతి చదువుతున్న పెద్ద కుమార్తెపై కామాంధ తండ్రికి కన్నుపడింది. అంతే ఇంట్లో భార్య లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత పలు మార్లు అదేవిధంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ యువతి అనారోగ్యానికి గురైంది. దీంతో ఆస్పత్రి తీసుకెళ్లిన తల్లికి వైద్యులు చెప్పిన మాట విని గుండె ఆగిపోయినంత పని అయింది.
ఇంటికి వెళ్ళి కుమార్తెను నిలదీయగా అసలు విషయం చెప్పింది. ఇదే విషయంపై భర్తను నిలదీయగా ఈ విషయం బయటకు చెబితే అందర్నీ చంపేస్తానని హెచ్చరించాడు. పైగా, గర్భస్రావం చేయించాలని రూ.20 వేల నగదు ఇచ్చాడు. దీంతో దిక్కుతోచని ఆ తల్లి.. కుమార్తెను వెంటబెట్టుకుని పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికెళ్లి అబార్షన్ చేయాలని వైద్యులను ప్రాధేయపడింది.