సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో యువత పెడదోవపడుతోంది. ఈ క్రమంలో ప్రేమ వలలో యువత పడిపోతున్నారు. ఆపై మోసపోయే వారు అనేకమంది. తాజాగా గుండెలపై పెట్టుకుని పెంచిన కన్నకూతురు చేస్తున్న నిర్వాకం చూసిన తండ్రికి ఆవేశంతో ఊగిపోయాడు. తన పెంపకానికే మచ్చ తెచ్చేలా చేసిన కూతురును, పబ్లిక్‌లోనే చితకబాదాడు. ఈ ఘటన ఆదివారంనాడు వరంగల్‌లోని ఎస్2 థియేటర్ వద్ద చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే, సదరు కూతురు తన ప్రియుడితో కలసి సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లింది. ఊహించని విధంగా అదే థియేటర్‌కు ఆమె తండ్రి వచ్చాడు. ప్రియుడితో ఉన్న కూతురును చూసిన ఆ కన్నతండ్రి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతావని తాము ఆశపడుతుంటే ఇలా చేస్తావా అంటూ ఫైర్ అయ్యాడు. చదువు పేరిట చేసే నిర్వాకం ఇదా? అంటూ మండిపడ్డాడు.