పద్మ, సత్యనారాయణ దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కానీ ఏడాది నుంచి సంధ్య అనే మహిళతో సత్యనారాయణ సిరిసిల్లలో నివాసం ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సత్యనారాయణ సతీమణి పద్మ బంధువులతో కలిసి దాడి చేసింది. సత్యనారాయణతో పాటు మరో మహిళను పద్మతో పాటు ఆమె బంధువులు చితక్కొట్టారు.
కానీ సంధ్య మాత్రం తనను సత్యనారాయణ ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడని చెప్తోంది. ఈ విషయం సత్యనారాయణ మొదటి భార్య పద్మకు కూడ తెలుసునని సంధ్య ఆరోపిస్తోంది. కానీ పద్మ మాత్రం ఇవన్నీ ఉత్తుత్తి మాటలేనని.. సత్యనారాయణ కోసం ఏడాది పాటు వెతికానని.. ఆచూకీ తెలుసుకున్నాకే.. సిరిసిల్లకు బంధువులతో వచ్చానని స్పష్టం చేసింది. అంతేగాకుండా సత్యనారాయణను భార్య పద్మ చెప్పుతోనే దాడి చేసింది. ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.