అన్ని రంగాలకు ప్రాధాన్యం ఉండే సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడం కోసం పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ,జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తుది కసరత్తులో నిమగ్నమయ్యారు.
ఉపాధి, సాంకేతికత పెంపు, పర్యావరణహిత,ఆదాయ వంటి అంశాల సమ్మిళతంగా కొత్త పాలసీని తీసుకురావడమే ముఖ్యమంత్రి లక్ష్యమని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.
పారిశ్రామిక విధానంపై జరిగిన సమీక్షా సమావేశంలో పరిశ్రమలు,వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.