ఒక రాష్ట్రంలో చెల్లని నాణెం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుందంటూ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ బిడ్డ అంటూ చెప్పిన షర్మిల.. హైదరాబాదులో ఎన్నికలు వచ్చేటప్పటికి పోటీ చేయలేని పరిస్థితి వచ్చిందని ఎత్తి చూపారు. ఢిల్లీలో ఎలా మెలగాలి.. కాంగ్రెస్ పెద్దలతో ఎలా ఉండాలి.. అక్కడ నుంచి ఏమి హామీలు తీసుకోవాలి అని ట్రైనింగ్ ఇచ్చి సీఎం జగన్ మోహన్ రెడ్డి పంపించాడన్నారు.
షర్మిలకి పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే వచ్చే పరిణామాల గురించి ఆలోచించాలనే ఇలా మాట్లాడుతున్నానని హర్షకుమార్ పేర్కొన్నారు. జగన్, షర్మిల ఇద్దరూ ఒకటేనని హర్ష కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అనుభవజ్ఞులైన నేతలున్నారని.. వారిలో ఎవరినైనా పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయాలని చెప్పారు.