కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన గల్లా అరుణకుమారి ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. తెలుగుదేశంపార్టీలో చేరినా ఆ పార్టీ నేతలు పూర్తిస్థాయిలో అరుణకుమారిని ఆహ్వానించకపోవడంతో పార్టీకే దూరంగానే ఉంటూ వస్తున్నారు. తండ్రి నుంచి వారసత్వంగా తీసుకున్న రాజకీయాలను పూర్తిగా వదిలేద్దామనుకున్న ఆలోచనలో ఉన్నారట గల్లా అరుణకుమారి. తన కుమారుడు ఎంపి గల్లా జయదేవ్ రాజకీయాల్లో చురుగ్గా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట అరుణ.
భర్త గల్లా రామచంద్రనాయుడుతో సంప్రదింపులు జరిగిన తరువాతనే ఒక నిర్ణయానికి వచ్చారట గల్లా అరుణ. ఇప్పటికే చంద్రగిరిలో తెదేపా తరపున పోటీ చేసి ఓడిపోయిన తరువాత... కనీసం నియోజవర్గ ప్రజల నుంచి పార్టీ నేతల నుంచి సరైన గౌరవం లేకపోవడంతో అరుణ నిర్ణయం తీసేసుకున్నారట. రాజకీయాలకు దూరంగా ఉంటేనే ప్రస్తుతం మంచిదని, తమ బిజినెస్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట.